Home  »  TV News  »  జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పి తప్పు చేశాను!

Updated : Sep 17, 2022

ధనాధన్ ధన్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు ధన్ రాజ్. జబర్దస్త్ కి రాక ముందే ఎన్నో మూవీస్ లో కూడా  నటించాడు. ఇప్పుడు కూడా మూవీస్ లో నటిస్తున్నాడు కానీ మల్లెమాల టీమ్ నుంచి ఆయన ఎప్పుడో ఆగిపోయాడు. దీనికి సంబంధించిన ఎన్నో విషయాలు ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. 

"జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పి తప్పు చేసాను. ఈ విషయంలో నేను వేణును చాలాసార్లు తిట్టాను కూడా. అప్పట్లో మా టీవీలో 'ఆలీ టాకీస్' అనే ప్రోగ్రామ్ వచ్చేది. ఆ షోకి ఆలీ గారు అనుకోని కారణాల వలన దూరమయ్యేసరికి ఆ షో పేరుని 'మా టాకీస్'గా మార్చారని వేణు చెప్పాడు. ఇక అందులో నేను, నువ్వు యాంకర్స్ అని చెప్పి ఒప్పించాడు వేణు. 'మనం యాంకరింగ్ చేయగలమా?' అని కూడా అడిగాను.. చేయగలం అని చెప్పాడు. అప్పటికి  జబర్దస్త్ లో ఉన్నాం. 'మా టాకీస్' యాంకరింగ్ ఆఫర్  గురించి జబర్దస్త్ దీప్తి గారితో చెప్పాను. అది యాంకరింగ్, ఇది కామెడీ.. రెండూ చేస్తే బాగోదు. ఆడియన్స్ కూడా బోర్ ఫీల్ అవుతారు. 'మా టాకీస్' షో కాంట్రాక్టు అయిపోయిన తర్వాత జబర్దస్త్ కు రావాలని దీప్తి గారు చెప్పారు. నాకు ఆ విషయం ఎంతో నచ్చింది." అని చెప్పుకొచ్చాడు ధ‌న్‌రాజ్.

"మా టాకీస్ ఐపోయాక జబర్దస్త్ కి వెళదాం అని అనుకున్నా కానీ అప్పటికే నేను, వేణు లేని లోటును గెటప్ శీను, సుడిగాలి సుదీర్ భర్తీ చేశారు. నేను, వేణు మళ్ళీ జబర్దస్త్ కి వెళ్తే అప్పటివరకు టీమ్ లీడర్లుగా చేస్తున్న వాళ్లు మళ్లీ కంటెస్టెంట్లుగా చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా అప్పుడప్పుడే ఎదుగుతున్నారు. మేమెందుకు వెళ్లి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి అనుకుని వెళ్ళలేదు." అంటూ ధన్ రాజ్ చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.